ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గత మేడారం జాతర హుండీ ఆదాయం ఎన్నికోట్లు తెలుసా? - samakka saralamma jathara

తెలంగాణ కుంభమేళ మేడారం జనసంద్రమవుతోంది. అమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఏయేటి కాయేడు అమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అందుకు అనుగుణంగా హుండీలకు చేరే అదాయం కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. గతంలో లక్షల్లో ఉన్న హుండీ ఆదాయం నేడు కోట్లకి చేరింది.

medaram-hundi-income-counting
medaram-hundi-income-counting

By

Published : Feb 4, 2020, 11:46 AM IST

గత మేడారం జాతర హుండీ ఆదాయం ఎన్నికోట్లు తెలుసా?

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతోంది. రెండేళ్లకోసారి వనం వీడి జనం చెంతకు చేరే తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడారం ప్రాంతమంతా జనసంద్రంగా మారుతోంది. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎవరికి తోచినంత వారు హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. ఫలితంగా ప్రతిరోజు జాతరలో భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీలో ఆదాయం కూడా పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జాతరకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోంది. వసతులు పెరగడం వల్ల భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.

దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. ఫలితంగా విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో దర్శనమిస్తుంది. 1980 ప్రాంతంలో మేడారం హుండీ ఆదాయం నాలుగున్నర లక్షలుగా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ కోట్లకు చేరింది. గతేడాది హుండీ ఆదాయం రూ.10 కోట్లకు పైమాటేనట!

భక్తులు హుండీలో సమర్పించుకునే ఆదాయంతో పాటు పుట్టు వెంట్రుకలు, ప్రత్యేక దర్శనాలు, లడ్డూ ప్రసాదం ద్వారా మరింత ఆదాయం సమకూరుతోంది.

మేడారం జాతర అనంతరం హుండీల లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం వస్తున్నందున ఈ ఏడు జాతరలో ఎంత ఆదాయం తల్లులకు చేరుతుందనే ఆసక్తి అందరిలోనూ... నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details