తెలంగాణ మేడారంలో జరుగుతున్న చిన్న జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శుక్రవారం మూడోరోజూ భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయాన్నే అమ్మవార్ల పూజా సామగ్రి అడేరాలు, పసుపుకుంకుమ గద్దెకు చేర్చడంతో మండమెలిగె పండుగ ఘట్టం ముగిసినా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.
జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన గద్దెలకు వచ్చి ఎత్తుబెల్లం, చీరసారె, పూలుపండ్లను, టెంకాయ, సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జంపన్నవాగు, చిలుకలగుట్ట, రెడ్డిగూడెం, ఊరట్టం, కొత్తూరు తదితర ప్రాంతాల్లో భక్తులు గుడారాలు ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు మొక్కులు కొనసాగాయి. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శుక్రవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిన్న జాతర శనివారంతో ముగుస్తుంది.
నేడే మాఘశుద్ధ పౌర్ణమి