ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి ఎంబీబీఎస్​, బీడీఎస్​ వెబ్​ కౌన్సెలింగ్ - బీడీఎస్​ వెబ్​ కౌన్సెలింగ్

కన్వీనర్​ కోటాలో వైద్య విద్య తొలి విడత సీట్ల భర్తీకి వెబ్​ ఆప్షన్ల ప్రక్రియకు తెరలేచింది. ఈ మేరకు మంగళవారం నుంచి... 4వ తేదీ వరకూ ఆన్​లైన్​లో ఇవ్వాలంటూ ప్రకటన విడుదల చేసింది. అఖిల భారత వైద్య విద్య కోటాలో రెండో విడత ప్రవేశాల్లో సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయింది.

mbbs-and
mbbs-and

By

Published : Dec 2, 2020, 12:28 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో తొలి విడత సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు తెరలేచింది. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ఇప్పటికే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో జాబితాలోని వారంతా ప్రాధాన్య క్రమంలో వైద్య కళాశాలను ఎంచుకోవడానికి వర్సిటీ పచ్చజెండా ఊపింది.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో సీటు పొందడానికి నచ్చిన వైద్య కళాశాలల ఐచ్ఛికాలను ఈనెల 2న ఉదయం ఏడింటి నుంచి 4వ తేదీన సాయంత్రం 7 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఇవ్వాలంటూ ప్రకటన విడుదల చేసింది. వైద్యకళాశాలల వారీగా ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయనీ, మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని కోరింది.

తొలివిడత ప్రవేశాలు..

3 రోజుల ఆన్‌లైన్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం ఈనెల 5న తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో చేరేందుకు ఈనెల ఎనిమిదో తేదీని తుది గడువుగా నిర్ణయించనున్నట్లు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. కన్వీనర్‌ కోటాలో తొలి విడత ప్రక్రియ పూర్తయ్యాక ప్రైవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో తొలి విడత ప్రవేశాలు నిర్వహిస్తారు. అఖిల భారత వైద్యవిద్య కోటాలో రెండో విడత ప్రవేశాల్లో సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. కేటాయించిన కళాశాలల్లో చేరడానికి ఈనెల 8వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. తర్వాత కూడా ఆ కోటాలో సీట్లు మిగిలితే.. వాటిని తిరిగి రాష్ట్రాలకు 15 శాతం నిబంధనల మేరకు అందజేస్తారు. ఈ లెక్కన రాష్ట్రానికి 8వ తేదీ అనంతరం అఖిల భారత కోటా నుంచి మిగులు సీట్లు ఏమైనా వస్తే.. వాటిని కలుపుకొని రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో రెండో విడత ప్రవేశాలను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:పట్టభద్రుల ఓటర్ల జాబితాకు కొత్త షెడ్యూల్

ABOUT THE AUTHOR

...view details