ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: మేయర్​, డిప్యూటీ మేయర్​ల బాధ్యత స్వీకరణ నేడే... - hyderabad latest news

తెలంగాణలో.. జీహెచ్​ఎంసీ నూతన మేయర్​, డిప్యూటీ మేయర్లు ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులో బాధ్యతలు తీసుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరిస్తారు.

mayor
mayor

By

Published : Feb 22, 2021, 7:53 AM IST

తెలంగాణ.. గ్రేటర్ హైదరాబాద్ మహనగర పాలక సంస్థ నూతన మేయర్​గా ఎన్నికైన గద్వాల్ విజయలక్ష్మి నేడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్యాంక్​బండ్ బీఆర్కే భవన్​ పక్కన గల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులో ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. మేయర్​తో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఉదయం 9.30 గంటలకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​తో పాటు... రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. ఈ నెల 11వ తేదీన మేయర్, ఉపమేయర్ ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఈ పదవుల్లో ఐదేళ్ల వరకు ఉండనున్నారు.

ఇదీ చూడండి: కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం

ABOUT THE AUTHOR

...view details