ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ఈరోజు, రేపు వడగాల్పులు... ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు - తెలంగాణలో అత్యధిక ఉష్టోగ్రతలు

తెలంగాణలో భానుడు రోజురోజుకు మండిపోతున్నాడు. నిప్పులు కక్కుతూ... జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అత్యధిక ఉష్టోగ్రతలు నమోదు చేస్తూ... బయటికి వెళ్లాలంటేనే భయపడేలా ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

maximum-temperatures-in-telangana-on-tomorrow
తెలంగాణలో ఈరోజు, రేపు వడగాల్పులు... ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు

By

Published : Apr 3, 2021, 8:47 PM IST

తెలంగాణలో ఇప్పటికే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం పూట మాడు పగిలేలా ఎండలు దండి కొడుతున్నాయి. ఈ క్రమంలో... రాష్ట్రంలో ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి రెండు ప్రదేశాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరగనున్నాయని తెలిపింది.

ఈరోజు, రేపు... తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, మహబూబ్​నగర్, నారాయణపేట్ జిల్లాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండీ... పరిషత్‌ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఎస్​ఈసీ ఆరా

ABOUT THE AUTHOR

...view details