ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాషే సంస్కృతికి వెలుగు: మారిషస్ దేశ తెలుగు బోధనాధికారి - Mauritius Teaching Telugu officer Sanjeeva Narsimha

మాతృ భాషను కాపాడుకున్నప్పుడే ఆ భాష ప్రజస సంస్కృతి సంప్రదాయాలు విలసిల్లుతాయని మారిషస్ దేశ తెలుగు బోధనాధికారి సంజీవ నర్సింహ అప్పడు అభిప్రాయపడ్డారు.

mauritius-teaching-telugu-officer-sanjeeva-narsimha
భాషే సంస్కృతికి వెలుగు: మారిషస్ దేశ తెలుగు బోధనాధికారి

By

Published : Dec 26, 2019, 4:39 AM IST

తెలుగు సంస్కృతి నిలబడాలంటే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశాల్లో ఉన్నా తమకు తెలుగంటే ప్రాణమని, తెలుగే దైవమని చెప్పారు. తెలుగును చక్కగా పరిరక్షించుకుంటున్నామని గుంటూరులో తెలిపారు.
అన్నీ తెలుగు నేల మీద జరిగినట్లే...
5తరాలకు ముందు తమ పెద్దలు విజయ నగరం నుంచి కాకినాడ సమీపంలోని కోరంగికి వలస వెళ్లినట్లు సంజీవ నర్సింహ అప్పడు తెలిపారు. 1834లో ఆంగ్లేయులు భక్తి, మతం పేరుతో మాయమాటలు చెప్పి మారిషస్​కు తరలించినట్లు పేర్కొన్నారు. అలా వలస వెళ్లిన తెలుగు వారిని ఈనాటీకి కోరంగులు అని పిలుస్తున్నట్లు వెల్లడించారు. అదే పేరుతో అక్కడి కోరంగి అనే ప్రాంతం ఏర్పడినట్లు తెలిపారు. అక్కడ ఆచార వ్యవహారాలన్నీ తెలుగు నేల మీద జరిగనట్లే జరుగుతాయని... పండగలు వ్రతాలు తప్పకుండా జరుపుకుంటామని వివరించారు. వివాహాల విషయంలో వరకట్న సమస్య లేదని తెలిపారు.
తెలుగు భాషకు సముచిత స్థానం....
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు మంగళ్ మహదేవ్, పార్వతీ శివుల విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్లు మారిషస్ దేశ తెలుగు బోధనాధికారి సంజీవ నర్సింహ తెలిపారు. ప్రతి ఉత్సవంలోనూ సంప్రదాయంతో పాటు తెలుగు భాషకు సముచిత స్థానం స్థానాన్ని ఇచ్చి తెలుగులోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లు ఆయన వివరించారు.
30 సంకీర్తనలు... 55వేల ప్రతులు
అన్నమాచార్యుల 32వేల సంకీర్తనల నుంచి 30 సంకీర్తనలను ఎంపిక చేసి, వాటికి తెలుగు, ఆంగ్ల అర్ధాలను సమకూర్చి 55వేల ప్రతులను ఇటీవల ముద్రించినట్లు సంజీవ నర్సింహ తెలిపారు. మారిషస్ దేశంలో తెలుగు భాషాభివృద్ధిలో భాగంగా అందరికీ పంచినట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయం సహించరానిది...
తెలుగు భూమి నుంచి పవిత్రమైన మట్టిని తీసుకెళ్లి నుదిటిన తిలకంగా ధరిస్తున్నట్లు మారిషస్ దేశ తెలుగు బోధనాధికారి సంజీవ నర్సింహ అప్పడు తెలిపారు. తెలుగు నేల మీద పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మారిషస్ దేశంలో తెలుగును అక్కడి ప్రజలతో పాటు ప్రభుత్వం సైతం ఎంతో గౌరవిస్తుంటే... ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో తెలుగును పూర్తిగా తీసివేయాలని చూస్తున్నరన్నారు. తెలుగు భాష గతి ఎమవుతుందోనని భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైన తెలుగు మాధ్యమాన్ని తీసేయటం సహించరాని అంశమన్నారు.

మారిషస్ ప్రభుత్వం తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, మరాఠీ, ఉర్దూ, భోజ్​పురి, ఫ్రెంచ్, క్రియోల్ వంటి అన్ని భాషలనూ ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనికి కావాల్సిన నిధులను సైతం ప్రభుత్వం ఏటా సమకూరుస్తున్నట్లు సంజీవ నర్సింహ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details