Maternal Mortality: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావంతో గత రెండేళ్లలో మాతృ మరణాలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. 2018-19లో 461, 2019-20లో 386 చొప్పున మాతృ మరణాలు నమోదయ్యాయి. 2020-21లో 474, 2021-22లో 629 మరణాలు నమోదు కావడం కొవిడ్ ప్రభావ తీవ్రతను స్పష్టం చేస్తోంది. అలాగే గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ మధ్య రాష్ట్రంలో 6,71,655 మంది శిశువులు జన్మించారు.. ఇందులో ప్రసవానికి ముందు, తర్వాత కలిపి 629 మంది తల్లులు మరణించగా వీరిలో 30% మంది కొవిడ్ కారణంగా (డెల్టా వేరియంట్) చనిపోయారు. ఆలస్యంగా ఆసుపత్రులకు రావడం, వైద్యం అందడంలో జరిగిన జాప్యంవల్ల ఈ మరణాలు పెరిగాయి. అత్యధికంగా పూర్వ తూర్పుగోదావరి జిల్లాలో 108, తక్కువగా పూర్వ నెల్లూరు జిల్లాలో 15 మంది ప్రాణాలు విడిచారు. గిరిజన ప్రాంతాలు ఉన్న విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో మరణాలు ఎక్కువగా సంభవించాయి.
Increased maternal mortality: పెరిగిన మాతృ మరణాలు.. కారణం కొవిడ్ ప్రభావమే..!
గత రెండేళ్లలో మాతృ మరణాలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ ప్రభావంతో రాష్ట్రంలో మరణాలు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ మధ్య రాష్ట్రంలో 6,71,655 మంది శిశువులు జన్మించారు.. ఇందులో ప్రసవానికి ముందు, తర్వాత కలిపి 629 మంది తల్లులు మరణించగా వీరిలో 30% మంది కొవిడ్ కారణంగా (డెల్టా వేరియంట్) చనిపోయారు. ఆలస్యంగా ఆసుపత్రులకు రావడం, వైద్యం అందడంలో జరిగిన జాప్యం వల్ల ఈ మరణాలు పెరిగాయి.
మరణాలకు ఇతర కారణాలు:మాతృమరణాలకు సంబంధించి కారణాలను పరిశీలిస్తే.. గర్భం దాల్చినప్పుడు తీవ్రస్థాయిలో బీపీ, మూర్ఛ సమస్యలతో 14%, అధిక రక్తస్రావంతో 10%, రక్తం లేదా మూత్రం, ఇతరచోట్ల ఇన్‌ఫెక్షన్లతో 10%, రక్తహీనతతో 4శాతం మంది ప్రాణాలు విడిచారు. ఉమ్మనీరు వెలుపలికి వచ్చి రక్తంలో కలిసి ఊపిరితిత్తుల పనితీరును తగ్గించేలా చేయడం, శిశువు తల అధిక బరువు కలిగి ఉండడం, యోని ద్వారం వద్ద సమస్యలు, చిన్న వయసులో వివాహాలు జరగడం లాంటి కారణాలతో ఇతరులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
28రోజుల వయసులోపు:రాష్ట్రంలో 2021-22లో శిశువుల మరణాల వివరాలు పరిశీలిస్తే.. పుట్టినప్పటి నుంచి 28 రోజుల వయసులోపే 5,260 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని ఐదేళ్లలోపు వయసు కలిగివారు 2021-22లో మొత్తం 8,200 మృతి చెందారు. వీరిలో 39.02% మంది శ్వాసకోశ సమస్యలతో ప్రాణాలు విడిచారు.
ఇదీ చదవండి:వైఎస్ విజయమ్మ కేసీఆర్ చిరంజీవిలను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి రోజా