తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై దాడి చేసిన వారిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని జాతీయ బీసీ సంఘం డిమాండ్ చేసింది. లేకుంటే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. మాచర్ల ఘటనపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరో బిహార్‌లా మారిందని, ఏపీలో బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
'మాచర్ల దాడి నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలి' - మాచర్ల దాడి ఘటన
మాచర్ల ఘటనపై....సీఎం జగన్ సమాధానం చెప్పాలని జాతీయ బీసీ సంఘం డిమాండ్ చేసింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై దాడి చేసిన వారిని...24 గంటల్లోగా అరెస్ట్ చేయాలన్నారు.
!['మాచర్ల దాడి నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలి' జాతీయ బీసీ సంఘం లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6370126-90-6370126-1583929729785.jpg)
జాతీయ బీసీ సంఘం లేఖ