ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Stamps and Registrations Revenue: కాసుల వర్షం కురిపిస్తోన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ..! - రోజుకు 50 కోట్ల రాబడి

stamps and registrations revenue: తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. డిసెంబరు నెలలో రికార్డు స్థాయిలో.. 12 వందల 58 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే స్థాయిలో రాబోయే 3 నెలల్లో రాబడులు వచ్చినట్లయితే.. ప్రభుత్వం నిర్దేశించిన 12 వేల 500 కోట్ల లక్ష్యం చేరడం ఖాయమని స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ అంచనా వేస్తోంది.

Stamps and Registrations
Stamps and Registrations

By

Published : Jan 10, 2022, 9:46 AM IST

కాసుల వర్షం కురిపిస్తోన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ..

stamps and registrations revenue: తెలంగాణ రాష్ట్రంలో స్థిర, చరాస్థుల రిజిస్ట్రేషన్ల ద్వారా సాధారణంగా నెలకు అయిదారు వందల కోట్ల రాబడి వచ్చేది. అంటే రోజుకు 25 నుంచి 30 కోట్లకు మించేది కాదు. కానీ.. ఇటీవల ఆదాయం రెట్టింపు అయ్యింది. రోజుకు 40 నుంచి 50 కోట్ల రూపాయల రాబడి వస్తోంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ పెంచిన కొన్ని రోజులపాటు.. రిజిస్ట్రేషన్లు కాస్త మందగించినా.. ఆ తర్వాత పుంజుకున్నాయి. దీంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి 12 వేల 500 కోట్ల రూపాయల మేర రాబడులను లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చేందుకు కొన్ని రోజులు... ఇంకొన్ని రోజులు కోవిడ్‌ మూలంగా... దాదాపు 50 రోజులు రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ పెంచింది. ఈ రెండు కారణాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడుతుందని అధికారులు సైతం అంచనా వేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పదివేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం... కరోనా ప్రభావంతో లక్ష్యాన్ని ఆరువేల కోట్లకు సవరించింది. అయినా అంత మొత్తం కూడా రాలేదు. గత ఆర్థిక ఏడాదిలో 10.76లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యి.. కేవలం 4 వేల 787 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది.

ఒక్క నెలలోనే రికార్డుస్థాయి రాబడి..
డిసెంబరు నెలలో వచ్చిన రాబడులు చూస్తే మాత్రం.. అధికారుల అంచనాలు తలకిందులయ్యాయని చెప్పొచ్చు. డిసెంబరు ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో రూ.వెయ్యి 258కోట్లు రాబడి వచ్చింది. గతంలో వచ్చే.. నెల రాబడితో పోలిస్తే రెట్టింపు అయ్యింది. ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు గడిచిన 9 నెలల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖలో... 8లక్షల 58వేల 939 రిజిస్ట్రేషన్లు జరిగి రాష్ట్ర ప్రభుత్వానికి 8,250 కోట్లు రాబడి వచ్చింది.

దీంతో.. నిర్దేశించిన లక్ష్యంలో 66శాతం ఆదాయం వచ్చినట్లయింది. మరో 3 నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి) నెలలు మిగిలి ఉండడంతో.. ఈ 3 నెలలు కూడా ఇంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని.. అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు. టార్గెట్ ప్రకారు ఇంకా.. 4 వేల 250 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ప్రతినెలా 14వందల కోట్లు వస్తే.. లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

ap government focus on SC loans: ఎస్సీ రుణ బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి

ABOUT THE AUTHOR

...view details