ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 5:26 PM IST

ETV Bharat / city

భారీగా పెరిగిన ఉల్లి ధరలు... ఎంతో తెలుసా..?

ఉల్లి కొనాలంటే కన్నీళ్లు పెట్టిస్తోంది. నగరంలో కిలో ఉల్లి 100రూపాయలకు చేరుకుంది. గత కొంత కాలం నుంచి కురుస్తోన్న వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం వల్లే భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

భారీగా పెరిగిన ఉల్లిధరలు... ఎంతో తెలుసా..?
భారీగా పెరిగిన ఉల్లిధరలు... ఎంతో తెలుసా..?

హైదరాబాద్​లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్​లో నాణ్యమైన ఉల్లి 100 రూపాయల వద్దకు చేరుకుంది. మలక్​పేట్​ హోల్​సేల్ మార్కెట్​లో క్వింటా​ ఉల్లి ధర ఇవాళ 8 వేల 500 రూపాయలకు చేరుకుంది. నాణ్యతను బట్టి కనిష్ట ధర 40 రూపాయలుగా ఉంది. నాలుగు రోజులు క్రితం ఇదే మార్కెట్​లో కిలో ఉల్లి గరిష్ఠంగా 50 రూపాయల మాత్రమే ఉందని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. గత కొంత కాలం నుంచి కురుస్తోన్న వర్షాల వల్ల పంటలు దెబ్బతిని మార్కెట్లోకి రావాల్సిన మేర సరుకు రావటం లేదని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు.

కర్నూలు, రాయచూర్, కర్ణాటక, మహారాష్ట్రలో మొదటి పంట రావాల్సి ఉందని, వరదల వల్ల ఇవి దెబ్బతిన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజన్​లో పండాల్సిన పంట నాశనం అవటం వల్ల పాత స్టాక్ మాత్రమే వస్తోందని వారు అన్నారు. రాష్ట్రంలో అలంపూర్, నారాయణ్ ఖేడ్ ప్రాంతాల్లోని పంట వచ్చే నెల నుంచి మార్కెట్​ను చేరుకునే అవకాశం ఉందని వారు తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details