ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీకి తరలిస్తుండగా... తెలంగాణలో భారీగా మద్యం పట్టివేత - illigal wine rescued in alampur

తెలంగాణ నుంచి నుంచి రాష్ట్రానికి భారీస్థాయిలో మద్యం తరలిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు. 1704 మద్యం బాటిళ్లు, 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలోని పంచాలింగాలో భారీగా మద్యం పట్టివేత
తెలంగాణలోని పంచాలింగాలో భారీగా మద్యం పట్టివేత

By

Published : Sep 8, 2020, 11:08 PM IST

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పంచాలింగాల వద్ద పోలీసులు భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి భారీస్థాయిలో మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. వనపర్తి జిల్లా పెబ్బెరులోని యాదవ్ కాలనీకి చెందిన వేముల రాజు గౌడ్ అనే వ్యక్తి నుంచి 1,704 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూల్ జిల్లా పంచలింగాలకు చెందిన చాకలి బీచ్‌పల్లి, తులశాపురం గ్రామానికి చెందిన సురేశ్, ఓర్వకల్లు మండలం తోటగేరికి చెందిన కే. సురేశ్, కర్నూల్ ముజఫర్ నగర్ కు చెందిన ఎస్బీ శేఖర్ కలుగోట్ల గ్రామానికి చెందిన హెచ్.శివకుమార్ లపై కేసు నమోదు చేశారు. 8 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు లక్ష్మిదుర్గయ్య తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details