ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చేపల్ని మింగేసిన కాలుష్యం!

అక్కడ రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటికి పారిశ్రామిక వాడల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు చేరి కలుషితమయ్యాయి. ఈ నీరు చెరువులోకి చేరటంతో అందులోని చేపలన్నీ చనిపోయాయి. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

By

Published : Sep 17, 2020, 9:51 PM IST

Published : Sep 17, 2020, 9:51 PM IST

massive-fish-kill-pharma-toxic-burst-in-ameenpur-mandal-at-sangareddy-district
massive-fish-kill-pharma-toxic-burst-in-ameenpur-mandal-at-sangareddy-district

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం దాయార గ్రామ పంచాయితీ పరిధిలో విషాదకర ఘటన జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... పారిశ్రామిక వాడల నుంచి కాలుష్య జలాలు గండిగూడ చెరువులో చేరటంతో అందులోని చేపలన్నీ మృత్యువాతపడ్డాయి.

చేపల్ని మింగేసిన కాలుష్యం!

2 నుంచి 3 కిలోలు ఎదిగి.. చేతికి వస్తున్నాయనుకునే సమయంలో చేపలన్నీ చనిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు నిర్వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:భాగ్యనగరంలో కుండపోత వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు

ABOUT THE AUTHOR

...view details