నిన్న రాత్రి వాసవీభవన్ 3వ అంతస్తులో 306 గది అద్దెకు తీసుకున్న మారుతీరావు ఇవాళ ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే మారుతీరావు మృతి చెందినట్లు భావించారు. ఘటనాస్థలిలో పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. గిరిజా క్షమించు, అమృతా అమ్మ దగ్గరికి రా అని రాసివున్న లేఖ దొరికింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మారుతీరావు డ్రైవర్, ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ప్రణయ్ హత్యకేసు: ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య - ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతి
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని వాసవీభవన్‌లో ఈ ఘటన జరిగింది.
ప్రణయ్ హత్యకేసు: ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య
మారుతీరావు కుమార్తె అమృతను అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించి మారుతీరావు సహా 8మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.