తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని రామాపురం క్రాస్‌రోడ్ వద్ద చెక్‌పోస్ట్ మూసివేసిన కారణంగా... ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనల దృష్ట్యా ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండంలో పెళ్లికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కారణంగా.. రాష్ట్రానికి చెందిన వాళ్లు ఇబ్బందులు పడ్డారు.
అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం నుంచి తీసుకున్న అనుమతి పత్రం చూపించినా.. పోలీసులు నిరాకరించారని బంధువులు వాపోతున్నారు. గంటసేపు ఎండలో బతిమిలాడుతూ తీవ్ర ఇబ్బందులు పడిన తర్వాత ఎట్టకేలకు పెళ్లికి వెళ్లడానికి పోలీసులు అంగీకరించారు.