ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా నేతలే దళారుల ముసుగులో రైతులను దోచేస్తున్నారు' - Marreddy Srinivasa Reddy comments on ycp

వైకాపా నేతలే దళారుల ముసుగులో రైతులను దోచేస్తున్నారని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రైతుల ఉత్పత్తులను కొని దాని కింద చెల్లించే సొమ్ముని సాయంకిందే చూపుతోందని ధ్వజమెత్తారు.

మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

By

Published : Apr 25, 2021, 5:19 PM IST

రైతులను వైకాపా నేతలే దళారుల ముసుగులో దోచేస్తున్నారని... తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అకాల వర్షాలకు రైతులు నష్టపోతే ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి నుంచి ఆదుకునే విధంగా కనీసం ఒక్క ప్రకటన కూడా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. అకాల వర్షాలకు ధాన్యంతో పాటు అరటి, బొప్పాయి, పసుపు వంటి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల ఉత్పత్తులను కొని దాని కింద చెల్లించే సొమ్ముని సాయంకిందే చూపుతోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details