ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Maoists: తెలంగాణలోని ఆ జిల్లాలో 19 మంది మావోయిస్టుల లొంగుబాటు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్​ దత్​ తాజా వార్తలు

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 19 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు భద్రతకు ఆకర్షితులై లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.

Maoists  surrender
మావోయిస్టుల లొంగుబాటు

By

Published : Jun 15, 2021, 10:08 PM IST

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న 19 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు(Maoists) ఈరోజు చర్ల పోలీసుల ఎదుట లొంగి పోయారు. పులి గుండాల గ్రామానికి చెందిన పది మంది, బక్క చింతలపాడు గ్రామానికి చెందిన ఏడుగురు, ములకలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పోలీసులు ఎదుట లొంగిపోయారు.

పోలీసులు మారుమూల ప్రాంతాల్లోని లొంగిపోతున్న మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు భద్రతకు ఆకర్షితులై లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. లొంగిపోయిన 19 మంది మావోయిస్టుల్లో 17 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఇదీ చదవండి:Gun firing in Kadapa: గన్​తో కాల్చేశాడు.. ఆపై కాల్చుకున్నాడు.. ఇద్దరూ మృతి

ABOUT THE AUTHOR

...view details