తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు చర్యలు ప్రారంభించారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లెనిన్ కాలనీలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. బైక్‌తో సహా అతను ఎగిరి కిందపడ్డాడు.
గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు పాల్పడిన ప్రాంతంలో మావోయిస్టులు గోడ పత్రాలు వదిలి వెళ్లారు. చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పత్రాలు ఉన్నాయి. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే విడిచిపెట్టాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.