ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్తగూడెం ఎన్​కౌంటర్​పై మావోయిస్టుల లేఖ విడుదల - భద్రాద్రి ఎన్​కౌంటర్​పై మావోయిస్టు పార్టీ లేఖ

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఛత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బూటకపు ఎన్​కౌంటర్ చేశారని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. గుండాల మండలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శంకరును కావాలనే ఎన్​కౌంటర్​ చేశారని లేఖలో పేర్కొన్నారు.

bhadradri kothagudem encounter
bhadradri kothagudem encounter

By

Published : Sep 11, 2020, 8:01 PM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఛత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంత పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసగుప్ప వద్ద 4 రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

బూటకపు ఎన్​కౌంటర్​ అంటూ లేఖ..

ఇవి ఎదురుకాల్పులు కాదని.. బూటకపు ఎన్​కౌంటర్ అని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. గుండాల మండలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శంకర్​ను కావాలనే ఎన్​కౌంటర్​ చేశారని లేఖలో పేర్కొన్నారు.

ఎదురు కాల్పులుగా చిత్రీకరణ..

తెరాస ప్రభుత్వం ఇద్దరు మావోయిస్టు సభ్యులను చిత్రహింసలతో హత్య చేసి ఎదురు కాల్పులుగా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి ఏరియా డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. బూటకపు ఎన్​కౌంటర్​కి నిరసనగా పౌరహక్కుల సంఘాలు పోరాడాలని లేఖలో స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :

అంతర్వేది ఘటన చంద్రబాబు కుట్రే: రోజా

ABOUT THE AUTHOR

...view details