విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండల పరిధిలో గల బంగారుగుడ్డి అటవీ ప్రాంతమైన ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులో కూంబింగ్ నిర్వహించిన పోలీసు ప్రత్యేక దళాలకు మావోయిస్టులు దాచిన డంపు లభ్యమైంది. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డి.రాజకుమారి శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టుల కదలికల గురించి వచ్చిన సమాచారంతో బంగారుగుడ్డి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టి డంపును గుర్తించారు. ఇందులో 98 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 5 పెద్ద తుపాకులు, దేశవాలీ డబుల్ బ్యారెల్ తుపాకీలో ఉపయోగించే క్యాప్స్, 303 రౌండ్ల బుల్లెట్లను ప్రత్యేక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు పోలీసులపై దాడులు చేసేందుకు వీటిని దాచిపెట్టి ఉండవచ్చని ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా డంపును వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను, సిబ్బందిని, ప్రత్యేక దళాలను ఆమె అభినందించారు.
విజయనగరంలో మావోయిస్టుల డంపు స్వాధీనం - ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులో కూంబింగ్ వార్తలు
విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండల పరిధిలో మావోయిస్టులు దాచిన డంపు లభ్యమైంది. ఇందులో 98 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 5 పెద్ద తుపాకులు, దేశవాలీ డబుల్ బ్యారెల్ తుపాకీలో ఉపయోగించే క్యాప్స్, 303 రౌండ్ల బుల్లెట్లను ప్రత్యేక దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
Maoist Dump found in vizanagaram