ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Diwali effect: బాధితులతో కిటకిటలాడిన సరోజినీ దేవి ఆస్పత్రి - తెలంగాణ వార్తలు

దీపావళి వేళ(Diwali effect) బాణసంచా కాల్చిన సమయంలో గాయపడిన బాధితులు సరోజినీ దేవి కంటి ఆస్పత్రి(Sarojini devi eye hospital news) వద్ద క్యూ కట్టారు. పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రికి వచ్చారు. స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించి.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామని వైద్యురాలు డాక్టర్ కవిత తెలిపారు.

many-people-admitted-in-sarojini-devi-eye-hospital-after-diwali-celebration-with-fireworks
Diwali effect: బాధితులతో కిటకిటలాడిన సరోజినీ దేవి ఆస్పత్రి

By

Published : Nov 5, 2021, 12:47 PM IST

దీపావళి(Diwali effect) సందర్భంగా బాణాసంచా కాల్చిన సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల గాయపడిన బాధితులతో హైదరాబాద్​లోని సరోజనిదేవి కంటి (Sarojini Devi eye hospital ) ఆసుపత్రి కిటకిటలాడింది. పదుల సంఖ్యలో బాధితులు, చిన్నారులు కంటి గాయాలతో ఆస్పత్రి వద్ద క్యూ కట్టారు. సుమారు 31 మంది చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. బాధితుల్లో ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నామని.. వారిలో నలుగురిని అబ్జర్వేషన్​లో పెట్టినట్లు వైద్యురాలు డాక్టర్ కవిత తెలిపారు. వారిలో ఇద్దరికీ సర్జరీ చేశామని వెల్లడించారు. మిగతా వారికి చిన్నపాటి గాయాలు కావడంతో చికిత్స అందించి.. ఇంటికి పంపించేశామని పేర్కొన్నారు. గురువారం నుంచి సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అలర్ట్​గా ఉన్నట్లు వివరించారు.

Diwali effect: బాధితులతో కిటకిటలాడిన సరోజినీ దేవి ఆస్పత్రి

'నిన్నటి నుంచి సరోజినీ దేవి ఐ హాస్పిటల్​కి ఫైర్ క్రాకర్ ఇంజ్యూరీస్ కేసులు వస్తున్నాయి. ఇప్పటివరకు 31 కేసులు వచ్చాయి. వారిలో ఆరుగురిని అడ్మిట్ చేశాం. వారిలో నలుగురిని అబ్జర్వేషన్​లో పెట్టాము. ఇద్దరికీ సర్జరీ చేశాం. మిగతావారిలో 8మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇద్దరు మహిళలు ఉన్నారు. మిగతావారు పురుషులే. ఇద్దరు వేరే జిల్లా నుంచి వచ్చారు. మిగతావారందరూ హైదరాబాద్​ వారే. నిన్నటి నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం స్టాఫ్ అంతా సేవలందిస్తున్నాం. ఎవరు ఎప్పుడు వచ్చినా... వారందరికీ సేవలందించడానికి మేం రెడీగా ఉన్నాం.' -కవిత, అసిస్టెంట్ డాక్టర్

స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో(Sarojini devi eye hospital news) అడ్మిట్ చేసుకున్నామని ఆస్పత్రి సీనియర్ కంటి అసిస్టెంట్ వైద్యురాలు డాక్టర్ సునీత అన్నారు. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారని ఆమె పేర్కొన్నారు. బాణాసంచా ప్రమాదాలతో తీవ్రంగా గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి పంపించామన్నారు.

'ఉదయం నుంచి సాయంత్రం వరకు బాణాసంచా ప్రమాదాలతో 10 మంది కంటి ఆస్పత్రికి వచ్చారు. ఇద్దరిని అడ్మిట్​ చేసుకున్నాం. మిగిలిన కేసులను ఓపీ బేసీస్​లోనే ట్రీట్​ చేశాం. ఇద్దరు చిన్నారులు అడ్మిట్​ అయ్యారు.'

- డా.సునీత, డీఎంవో

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details