సజ్జల మీద కోపాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రపై చూపిస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు దుయ్యబట్టారు. తనకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ ఎక్కువ విలువ ఇవ్వడమే విజయసాయిరెడ్డి ఆవేదన అని విమర్శించారు. ఇరువురి పంపకాల్లో వచ్చిన తేడాలకు ఉత్తరాంధ్ర ప్రజల ఏం చేస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు లేకుండా ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారని మంతెన మండిపడ్డారు. సొంత జిల్లా నెల్లూరులో చెల్లని వ్యక్తి విశాఖరెడ్డిగా పేరొందారని ఆక్షేపించారు.
Manthena satyanarayana raju: 'సజ్జల మీద కోపాన్ని ఉత్తరాంధ్రపై చూపిస్తున్నారు' - AP TOP NEWS
సీఎం జగన్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువ విలువనిస్తూ.. తనను పట్టించుకోవట్లేదనే కోపాన్ని విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రపై చూపిస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

'సజ్జల మీద కోపాన్ని ఉత్తరాంధ్రపై చూపిస్తున్నారు'
ఉత్తరాంధ్రను లూటీ చేసే విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు అశోక్ గజపతిరాజును విమర్శించటం దుర్మార్గమని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల భూముల్ని మెడమీద కత్తులు పెట్టి గుంజుకున్నచరిత్ర విజయసాయిరెడ్డిదైతే.. లక్షలాది కుటుంబాలకు భూదానం చేసిన ఘనత అశోక్ గజపతిరాజు కుటుంబానిదని పేర్కొన్నారు. చేతనైతే అన్యాక్రాంతమైన భూముల వివరాలు బయటపెట్టాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.