ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఫ్రంట్ లైన్ వారియర్స్​కి కావాల్సింది సెల్యూట్ కాదు... పీపీఈ కిట్లు' - Manthena Satyanarayana raju comments on jagan

సీఎం జగన్​పై ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్​కి కావాల్సింది సెల్యూట్ కాదని... పీపీఈ కిట్లనే సంగతి గ్రహించాలని హితవు పలికారు. వైద్యుడు సుధాకర్​కి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

Manthena Satyanarayana Raju Comments On jagan Over Independence day speech
సత్యనారాయణరాజు ట్వీట్

By

Published : Aug 15, 2020, 8:37 PM IST

సత్యనారాయణరాజు ట్వీట్

స్వాతంత్య్ర దినోత్సవం రోజుల ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రసంగంపై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శలు గుప్పించారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్​కి కావాల్సింది సెల్యూట్ కాదు, పీపీఈ కిట్లనే సంగతి జగన్ రెడ్డి గ్రహించాలని హితవు పలికారు.

కిట్లు అడిగిన పాపానికి ఫ్రంట్ లైన్ వారియర్స్​ని కూడా చితకబాదిన సంగతి మర్చిపోయారా అంటూ... వైద్యుడు సుధాకర్​కి సంబంధించిన వీడియోను సత్యనారాయణరాజు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details