ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవో-2ను రద్దు చేయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు - జీవో-2ను రద్దు చేయాలని పలు జిల్లాల్లో నిరసనలు తాజా వార్తలు

జీవో-2ను రద్దు చేయాలని కోరుతూ.. పలు జిల్లాల్లోని గ్రామ సచివాలయ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డానికి మూలస్తంభంమైన పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేలా జీవో ఉందని.. ఇది సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం జీవో-2ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

mandal parishith officers Protests against to go-2
జీవో-2ను రద్దు చేయాలని నిరసనలు

By

Published : Mar 31, 2021, 5:09 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో మండల పరిషత్ కార్యాలయాల వద్ద గ్రామ సచివాలయ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది నిరసన చేపట్టారు. గ్రామ సచివాలయాల కార్యదర్శులకు ఉన్న అధికారాలను.. జీవో 2 ద్వారా తొలగించి, గ్రామ వీఆర్వోలకు బదలాయించాలన్న నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికు వినతి పత్రం..

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంపీడీఓ సిబ్బంది ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిని కలిశారు. పంచాయతీ రాజ్ సర్వీస్ సభ్యులు ఎంపీడీఓ కార్యలయం నుంచి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. జీవోను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇప్పటివరకు ఉన్న గ్రామ సచివాలయ కన్వీనర్, పంచాయతీ కార్యదర్శి అధికారులను పునరుద్ధరణ చేయాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తామని ఉద్యోగులకు ఎమ్మెల్యే హమీ తెలిపారు.

సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డానికి మూలస్తంభం..

కడప జిల్లా జమ్మలమడుగు ఎంపీడీవో కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవో సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు హాజరై జీవో 2కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డానికి మూలస్తంభంమైన పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేయడం సమంజసం కాదని ఎంపీడీవో సుబ్బారెడ్డి అన్నారు. జీవో నెంబర్-2 అమలైతే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు నామమాత్రం అవుతారని ఆందోళన వ్యక్తం చేసిన వారు.. దానిని రద్దు చేయాలని ఆయన కోరారు.

ఇవీ చూడండి:

విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉక్కు నిర్వాసితులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details