ల్యాండ్‌పూలింగ్ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో భూములివ్వాలని రైతులను కోరిన అజేయ కల్లం... ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మందడం రైతులు దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతే తమ అంతిమ లక్ష్యమని తేల్చిచెప్పారు. రైతుల నిరసనకు కామినేని శ్రీనివాస్, తెదేపా నేత గద్దె అనురాధ సంఘీభావం తెలిపారు. రైతుల 24 గంటల నిరాహార దీక్షను కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.
ఆగని రాజధాని రైతుల నిరసనలు..అజేయ కల్లంపై ఆగ్రహం - అమరావతి రైతుల ఆందోళన వార్తలు
అమరావతి కోసం రాజధాని రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ సీఎస్ అజేయ కల్లం మాట మారుస్తున్నారని రైతులు మండిపడ్డారు. కామినేని శ్రీనివాస్, తెదేపా నేత గద్దె అనురాధ రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు.
mandadam farmers protest in amaravathi