అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.మందడం రహదారిపై గ్రామస్థులు అడ్డంగా టెంట్ వేశారు. ఈ కారణంగా..సచివాలయానికి రాకపోకలు నిలిచాయి.మందడం-మల్కాపురం జంక్షన్ వద్ద....పోలీసులు భారీగా మోహరించారు.సచివాలయం వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని...తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకుని....గుర్తింపు కార్డులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు.తాము శాంతియుత నిరసన తెలుపుతున్నామని....ఆందోళనకారులు పోలీసులకు చెప్పారు. అడ్డుకోవద్దని కోరారు.
రైతుల ఆందోళనలు... నిలిచిపోయిన రాకపోకలు - amaravathi protest news updates
రాజధాని మార్పు ప్రతిపాదనలను నిరసిస్తూ..... అమరావతి ప్రాంత రైతుల ఆందోళన, నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ.... రైతులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మందడం రహదారిపై... గ్రామస్థులు అడ్డంగా టెంట్ వేసి నిరసన తెలుపుతున్నారు.
mandadam-farmers-darna