ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Manda Krishna Madiga: 'ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధిలేదు' - ap latest news

Manda Krishna Madiga: దిల్లీ తాల్కతోరా స్టేడియంలో మాదిగ విద్యార్థి జాతీయ మహాసభ నిర్వహించారు. అందులో ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ప్రకటనలు చేశారు.

Manda Krishna Madiga
Manda Krishna Madiga

By

Published : Dec 14, 2021, 10:55 PM IST

'ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధిలేదు'

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. దిల్లీ తాల్కతోరా స్టేడియంలో జరిగిన మాదిగ విద్యార్థి జాతీయ మహాసభలో ఆయన పాల్గొన్నారు. రాజకీయపరంగా అనేక అవరోధాలు సృష్టించినా 27 ఏళ్లుగా ఉద్యమం కొనసాగిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు. ఈ సభలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ప్రకటనలు చేశారు.

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం లేదని విమర్శించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, భాజపా నేత రావెల కిషోర్ బాబు, తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సహా ఇతర పార్టీలు, కుల సంఘాల నేతలు... వర్గీకరణకు అనుకూలంగా గళమెత్తారు.

'నా లక్ష్యం చేరుకోవడానికి ఎంత చిత్తశుద్ధితో పని చేస్తానో.. అంతే చిత్తశుద్ధితో.. వర్గీకరణ కోసం కృషి చేస్తాను. రాహుల్, సోనియా దృష్టికి తీసుకువెళతాను. ఈ సమావేశాల్లోనే వర్గీకరణ విషయాన్ని ప్రస్తావించేందుకు కృషి చేస్తాను.'

-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి:

Lokesh On CPS: మాట మార్చటంలో జగన్ రెడ్డి అంబాసిడర్​ - లోకేశ్

ABOUT THE AUTHOR

...view details