దిశపై పాశవిక దాడి జరిగిన రోజే.. తెలంగాణలోని వరంగల్లోనూ ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అయితే ఆ ఘటనలో నిందితుడు సాయి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పుట్టినరోజు నాడే తన కూతురిపై అత్యాచారం చేసి హతమార్చాడని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. దానిపై కూడా ప్రభుత్వం స్పందించి తన బిడ్డను హత్య చేసిన నిందితుడు సాయితోపాటు మిగతా వారినీ చిత్రహింసలు పెట్టి కాల్చి చంపాలని పోలీసులను కన్నీటితో వేడుకుంటోంది.
'దిశకో న్యాయం.. నా కూతురికో న్యాయమా' - వరంగల్లో మానస తల్లి నిరసన
దిశపై అత్యాచారం జరిగిన రోజే తెలంగాణలోని వరంగల్లో మరో యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలోని నిందితులనూ ఎన్కౌంటర్ చేయాలని ఆమె తల్లి వరంగల్లోని హన్మకొండలో నిరసన దీక్ష చేపట్టింది.

'దిశకో న్యాయం.. నా కూతురికో న్యాయమా'
'దిశకో న్యాయం.. నా కూతురికో న్యాయమా'
దిశ నిందితులను కాల్చి చంపి పోలీసులు న్యాయం చేశారని ఆ యువతి తల్లి పేర్కొంది. దిశ కేసులో న్యాయం చేసిన పోలీసులు... తన బిడ్డకేసులోనూ వెంటనే సాయిని ఎన్కౌంటర్ చేసి న్యాయం చేయాలంటూ వరంగల్లోని హన్మకొండ ఏకశిలాపార్క్ ముందు నిరసన దీక్షకు చేపట్టింది.
ఇదీ చూడండి: ఎన్కౌంటర్పై పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు