ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మే 25 నుంచి 'మన పాలన- మీ సూచన '

మే 25 నుంచి 29 వరకు 'మన పాలన- మీ సూచన ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.

manapalana-mee suchana programme on may 25
మే 25 నుంచి ' మన పాలన- మీ సూచన '

By

Published : May 23, 2020, 10:05 PM IST

ప్రజల సమక్షంలో మే 25 నుంచి 29 వరకు 'మన పాలన- మీ సూచన' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులు, ముఖ్యనాయకులు, నైపుణ్యం సాధించిన వారితో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్న దానిపై ప్రజలు సూచనలు ఇస్తారని ఆయన తెలిపారు.

ఈనెల 25న పాలన వ్యవస్థలో వికేంద్రీకరణ, సచివాలయ వ్యవస్థపై చర్చ, 26న వ్యవసాయ అనుబంధ రంగాలపై సూచనలు తీసుకుంటామని విజయ్ కుమార్ తెలిపారు. 27న విద్యారంగంలో మార్పులపై సూచనలు, 28న పరిశ్రమలకు వసతులపై సూచనలు, మౌలిక సదుపాయలు నైపుణ్యాభివృద్ధిపై సూచనలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. 29న ఆరోగ్యశ్రీలో మార్పులు వంటి అంశాలపై సమీక్షించుకోనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: అగ్రరాజ్యం నేవీలో.. తెలుగు తేజం

ABOUT THE AUTHOR

...view details