రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న 'మనబడి, నాడు-నేడు' కార్యక్రమం మొదటి విడత పనులు జూన్ 20వ తేదీ వరకు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పనుల్లో చాలావరకు పూర్తి అయినప్పటికీ... మిగిలిన అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయటం ద్వారా రెండోవిడత పనులు ప్రారంభించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సురేశ్ అధికారులతో మాట్లాడారు.
నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రహరీల నిర్మాణం, అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 557 ఉండగా అందులో 382 పూర్తయ్యాయని మిగిలిన 175 పనులు తక్షణమే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొత్తం 8038 పాఠశాలలకుగానూ ఇంకా 3681 చోట్ల ప్రహరీలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ట్రైబల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో జరుగుతున్న వాటిలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీల నిర్మాణాలు అన్నీ జూన్ 20 నాటికి పూర్తి చేయాలని... ఇకపై జాప్యం జరిగితే కుదరదని హెచ్చరించారు.
జగనన్న విద్యాకానుక కిట్లపై మంత్రి మాట్లాడుతూ... పాఠశాలలకు చేర్చే సమయాల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. జూన్ 1 నుంచి సరఫరా ప్రారంభించి జూలై 3వ వారానికి పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని అధికారులు వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతున్న కారణంగా... సామగ్రి రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యా కానుకలోని అన్ని వస్తువులు జులైలో అధికారులు చెప్పిన సమయానికి తప్పనిసరిగా చేరేలా చూడాలని మంత్రి సురేశ్ ఆదేశించారు. ప్రీప్రైమరీ పాఠశాలల్లో సిలబస్ విధానం, అకడమిక్ రూట్ మ్యాప్‌పై చర్చించారు.
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు..