ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: మాస్కు ధరించమంటే.. కత్తితో దాడి చేశాడు..! - one man attacked

కరోనా కారణంగా మాస్కు పెట్టుకోవాలని సలహా ఇచ్చినందుకే వ్యక్తిపై దాడికి దిగాడు మరో వ్యక్తి. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో జరిగింది.

తెలంగాణ: మాస్కు ధరించమంటే.. కత్తితో దాడి చేశాడు..!
తెలంగాణ: మాస్కు ధరించమంటే.. కత్తితో దాడి చేశాడు..!

By

Published : Jul 29, 2020, 5:56 PM IST

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో దారుణం జరిగింది. గ్రామంలోని హెయిర్ కటింగ్ సెలూన్‌కు ఆసిఫ్‌ అనే యువకుడు మాస్కు లేకుండా వచ్చాడు. సెలూన్​లో పనిచేస్తున్న రాజశేఖర్... మాస్కు పెట్టుకోవాలని సూచించాడు. కోపోద్రిక్తుడైన ఆసిఫ్... మాస్కు పెట్టుకోకపోతే నీకేంటంటూ గొడవకి దిగాడు. వెంటనే కత్తి తీసుకొని రాజశేఖర్​ నడుముపై దాడి చేశాడు.

తీవ్ర గాయాలపాలైన రాజశేఖర్​ను సెలూన్​ యజమాని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసిఫ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మాస్కు పెట్టుకోమని సలహా ఇచ్చినందుకే కత్తితో దాడి చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో ఎల్పీజీ శ్మశాన వాటికల ఏర్పాటుకు సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details