ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్రివర్ణ జెండా సాక్షిగా, భార్య గొంతు కోసి పరారైన భర్త

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే జాతీయ జెండా సాక్షిగా ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి తెగబడ్డాడు. భార్య గొంతు కోసి నిందితుడు అక్కణ్నుంచి పరారయ్యాడు.

murder
murder

By

Published : Aug 16, 2022, 12:46 PM IST

Man Killed Wife at Kesavapatnam జాతీయ జెండా సాక్షిగా భార్యను భర్త దారుణంగా హత్య చేసిన దారుణ సంఘటన తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా కేశవపట్నంలో చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్‌, కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన శిరీష(30) 11 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. శిరీష నాలుగేళ్లుగా అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో విడాకుల కోసం భర్తకు నోటీసులు పంపించింది శిరీష.

సోమవారం అంగన్‌వాడీ కేంద్రం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణలో ఉన్న శిరీషను, పథకం ప్రకారం అక్కడికి వచ్చిన ప్రవీణ్‌ ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. జనం చూస్తుండగానే కత్తితో గొంతు కోయడంతో ఆమె సంఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచింది. కుమార్‌ అనే యువకుడు అడ్డుకోబోగా.. కత్తితో పొడవడంతో చిన్నగాయమైంది. నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details