Bike on Fire: హైదరాబాద్ మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారని ఓ వ్యక్తి బైక్‌కు నిప్పంటించి తగులబెట్టాడు. ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ అనే వ్యక్తి రాంగ్‌రూట్‌లో రావటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. తనను ఎందుకు ఆపారని వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. దీంతో పోలీసులపై కోపంతో తన వాహనంపై తానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో బైక్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది.
పోలీసులు ఆపారని తన బైక్‌ను తానే తగులబెట్టిన వ్యక్తి - హైదరాబాద్ తాజా వార్తలు
Bike on Fire: వాహనదారుడు రాంగ్‌రూట్‌లో వచ్చాడు.. పోలీసులు అడ్డుకున్నారు.. 'నా బండినే ఆపుతారా' అంటూ కోపంతో ఊగిపోయాడు.. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.. అంతటితో ఆగాడా.. లేదు.. ఉక్రోశంతో తన బైకుకు తానే నిప్పంటించుకున్నాడు... ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
తన బైక్‌కు నిప్పంటించిన వాహనదారుడు