ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం.. పాతకక్షలే కారణం! - సిద్దిపేట జిల్లాలో కాల్పులు

Firing: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడోచోట తుపాకుల మోత వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా కాల్పుల ఘటన మరవకముందే... సిద్దిపేట జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది. 40 రోజుల వ్యవధిలో జిల్లాలో రెండో కాల్పుల ఘటన జరిగింది. ఇందుకు భూతగదాలు, పాతకక్షలే కారణమని తేల్చినట్లు సమాచారం.

1
1

By

Published : Mar 10, 2022, 10:00 AM IST

సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం.. పాతకక్షలే కారణం!

సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని చెల్లాపూర్‌కు చెందిన ఆకుల వంశీకృష్ణ.. కొంతకాలం కిందట ఓ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఈ వ్యవహారంలో ఒగ్గు తిరుపతి అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భూమిని ఎక్కువ ధరకు కొనేలా చేశాడనే ఆరోపణలతో..వంశీకృష్ణ 2020 జూన్‌లో తిరుపతిపై కత్తితో హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుకాగా... దుబ్బాక కోర్టులో విచారణ జరుగుతోంది. తనపై ఉన్న హత్యాయత్నం కేసులో వంశీకృష్ణ తల్లితో కలిసి బుధవారం దుబ్బాక కోర్టులో విచారణకు హాజరయ్యాడు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా... తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి వద్ద... తిరుపతి మరో వ్యక్తితో కలిసి వెనక నుంచి కాల్పులు జరిపారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకటి వాహనానికి, మరోటి నేలకు తాకింది. అప్రమత్తమైన వంశీకృష్ణ దారి మళ్లించి తప్పించుకున్నాడు.

రెండు బుల్లెట్లు స్వాధీనం

కాల్పుల నుంచి తప్పించుకున్న వంశీకృష్ణ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వంశీకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.... విచారణను కొనసాగిస్తున్నారు.

'వంశీకృష్ణ అనే వ్యక్తి తన తల్లితో కలిసి బుధవారం దుబ్బాక కోర్టులో విచారణకు హాజరయ్యాడు. తిరిగి వస్తుండగా.. అతని బంధువు బంధువు కాల్పులు జరిపినట్లు సమాచారం వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అసలు కాల్పుల వెనుక ఎవరెవరున్నారు.. గన్​ ఎవరు ఇచ్చారు అనే వాటిపై విచారణ జరుపుతున్నాం.' - శ్వేత, సిద్దిపేట సీపీ

కాల్పుల వెనక ఎవరెవరున్నారు?

కాల్పులకు పాల్పడిన తిరుపతి, మరో వ్యక్తి పోలీసులకు లోంగిపోయినట్లు సమాచారం. కాల్పుల వెనక ఎవరెవరున్నారు? వీరికి తుపాకి ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. సీపీ శ్వేత... ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇదీచూడండి:భూమి రిజిస్ట్రేషన్ కోసం వస్తే.. తుపాకీతో బెదిరించి రూ.40 లక్షలు లాక్కెళ్లాడు

ABOUT THE AUTHOR

...view details