Woman Murder: సహజీవనం చేస్తున్న మహిళతో వివాదాలు తలెత్తడంతో ఆమెపై కిరోసిన్ పోసి.. నిప్పంటిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కూకట్‌పల్లిలోని ప్రకాశ్‌నగర్‌లో ఓ మహిళ(55).. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమె భర్త ఇప్పటికే మృతిచెందగా.. కుమార్తెకు వివాహం చేసి.. కుమారుడితో పాటు ఉంటుంది. కొన్ని రోజుల క్రితం జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న వెంకటేష్ (55) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. అది కాస్త సహజీవనం వరకు వెళ్లింది.
Woman Murder: సహజీవనం చేసి.. సజీవ దహనం చేశాడు.. - a man set fired a women hyderabad
సహజీవనంలో మనస్పర్దలు తలెత్తడంతో ఓ వ్యక్తి సదరు మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.
అనంతరం కొద్దిరోజులకు వెంకటేష్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, చిత్రహింసలకు గురిచేయడంతో.. అతనికి దూరంగా ఉంటోంది. దీని సహించలేని వెంకటేశ్.. తనతో కలిసి ఉండాలంటూ వెంటపడేవాడు. బుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చిన వెంకటేష్.. గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన వెంకటేశ్ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఇద్దరికి మంటలు అంటుకోవడంతో అరుపులు వేశారు. గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పేశారు. అప్పటికే తీవ్రగాయాలతో మహిళ మృతిచెందగా.. వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరీశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి:murder case: నెల్లూరులో దారుణం.. వ్యక్తిని పొడిచి చంపిన స్నేహితులు