ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Viral Video: ఫోన్‌ డేటా కోల్పోతే తిరిగి తెచ్చుకోగలం.. మరి ప్రాణాలు పోతే..! - bike stunts in hyderabad

Viral Video : " రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయొద్దు.. ప్రాణాలు కోల్పోవద్దు.." అని పోలీసులు ఎంతలా మొత్తుకున్నా కొంతమంది వాహనదారులు కొంచెం కూడా చెవికెక్కించుకోవట్లేదు. సిగ్నల్‌ జంపింగ్‌, అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌తో పాటు పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇలాంటి వారు తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. అదే కోవకు చెందిన ఓ వ్యక్తి.. టూవీలర్‌ మీద పరిమితికి మించి లగేజీని తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

scooty with full of luggage driving Video
ఫోన్‌ డేటా కోల్పోతే తిరిగి తెచ్చుకోగలం.. మరి ప్రాణాలు పోతే

By

Published : Jun 23, 2022, 9:10 AM IST

Viral Video: పైసలకు కక్కుర్తి పడ్డాడో.. లేదా ఎంత లగేజీ అయినా తన బండి మీద తీసుకెళ్తానని నిరూపించాలనుకున్నాడో.. తన డ్రైవింగ్​ నైపుణ్యం నిరూపించాలనుకుని గొప్పలకు పోయాడో.. తెలీదు కానీ.. అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించి టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారిపోయాడు. ఎంతో నిర్లక్ష్యంతో.. ప్రమాదకరంగా.. స్కూటీపై ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్​​ మీడియాలో ట్రెండింగ్​లో ఉంది.

ఆటోలో తీసుకెళ్లాల్సిన లగేజీ మొత్తాన్ని.. స్కూటీపైనే తీసుకెళ్లాడు ఓ వ్యక్తి! కనీసం తాను కూర్చోడానికి స్థలం కూడా లేకుండా స్కూటీ మొత్తాన్ని లగేజీతో నింపి.. బైక్‌ చివర కూర్చొని చాలా ప్రమాదకరంగా వెళ్లాడు. అతను హెల్మెట్‌ ధరించాడు.. కానీ, అతని కాళ్లు మాత్రం రోడ్డుపైనే ఆనించి వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. దీనిని ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘నా ఫోన్‌ 32జీబీ అయితే.. 31.9జీబీతో నిండి పోయింది’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. జాగ్రత్త అంటూ కొందరు సలహా ఇస్తుండగా.. మరికొందరు అతని నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ వీడియోను తెలంగాణ స్టేట్ పోలీస్‌ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ కూడా షేర్‌ చేసింది. ‘‘మొబైల్‌ పాడైపోయినా తిరిగి డేటాను పొందవచ్చు. కానీ, ప్రాణాలు తిరిగిరావు. వాహనదారులూ మీ ప్రాణాలతో పాటూ ఇతరుల ప్రాణాలనూ ప్రమాదంలో నెట్టే ఇటువంటి రిస్క్‌ ప్రయాణాలు చేయకండి’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటికే 7లక్షల మందికి పైగా వీక్షించగా.. 24వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details