తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో రోగి బంధువులు అద్దాలను ధ్వంసం చేశారు. జిల్లాలోని ఐనవోలుకు చెందిన ఉప్పలయ్య శ్వాస సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. కరోనా సోకిందనే అనుమానంతో వైద్యులు... కొవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఉప్పలయ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఉప్పలయ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారని బంధువులు ఆరోపించారు. కొవిడ్ వార్డులోని అద్దాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు... ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.