మనం పోరాడాల్సింది కొవిడ్ వ్యాధితో గాని... రోగితో కాదని వైరస్ గురించి ఎంతలా అవగాహన కల్పిస్తున్నా.. ప్రాణ భయంతోనో... అవగాహన లోపంతోనే కరోనా రోగులకు అవమాన ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. బతికుండగానే మనుషుల్లా చూడడం లేదు.. చివరకు చనిపోయినా కనికరం కానరావడం లేదు.
మనుషుల ప్రవర్తన, మానవత్వం అంటే ఏంటో... కరోనా బట్టబయలు చేస్తోంది. బంధువులు, స్నేహితులే కాదు... కుటుంబసభ్యులు కూడా అతీతులేం కాదని నిరూపిస్తోంది. అలాంటి అమానవీయ ఘటన...తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో వెలుగుచూసింది. కొవిడ్‌తో మృతి చెందిన తల్లి(65), కుమారుడు(35) అంత్యక్రియలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు.