తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ పట్టణంలోని కంకరబోడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మాజహర్ భవన నిర్మాణ పనులు చేసేవాడు. సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఓ భవనంలో పని చేస్తుండగా కోతుల గుంపు ఒక్కసారిగా అతడి వైపు వచ్చాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో అతను అదుపు తప్పి భవనంపై నుంచి కిందపడిపోయాడు.
తెలంగాణ: కోతుల దాడిలో వ్యక్తి మృతి - కోతుల దాడి వార్తలు
కోతులు చేసిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌లో జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తిపై కోతులు గుంపుగా వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అతను భవనంపై నుంచి పడి తీవ్రగాయాలపాలయ్యాడు.
![తెలంగాణ: కోతుల దాడిలో వ్యక్తి మృతి one died in monkeys attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8659513-238-8659513-1599106314171.jpg)
కోతుల దాడిలో వ్యక్తి మృతి
తీవ్రగాయాలైన అతనిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య గర్భిణి కాగా... బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:ప్రియురాలి ఇంటికి నిప్పుపెట్టిన ప్రియుడి కుటుంబ సభ్యులు!