తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐదో అంతస్తు నుంచి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని కొవిడ్ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటన వేకువజామున మూడు గంటలకు జరిగినట్లు భద్రత సిబ్బంది తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.