సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు పోస్టు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మధుకర్‌రెడ్డి.. సోషల్‌మీడియాలో అశ్లీల వీడియోల లింకులు పంపి డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా భద్రత విభాగం పోలీసులు... మధుకర్‌రెడ్డిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మధుకర్‌రెడ్డిని గాలించగా.. కరీంనగర్లో పోలీసులకు పట్టుబడ్డాడు. మధుకర్రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
రంగంలోకి కేంద్ర హోంశాఖ..
చిన్నపిల్లలతో అసహజంగా చిత్రీకరించిన నీలిచిత్రాలు చూస్తున్న వారిని, వాటిని పంపే వారిని నేరుగా జైలుకే పంపిస్తున్నారు. ఎక్కడున్నా సరే వారిని పోలీసులు వెంటాడి, వేటాడి మరీ పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. నాలుగైదేళ్లుగా మైనర్లతో చిత్రీకరించిన నీలిచిత్రాల వెబ్‌సైట్లను వీక్షించే వారి సంఖ్య పెరుగుతుండడం, వీటి ప్రభావంతో చిన్నారులు, మైనర్లపై అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించి వారి చరవాణులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ఐపీ చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తించి నివేదికను ఆయా రాష్ట్రాలకు పంపుతోంది.