ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కవలల కల్యాణం.. కనులకు రమణీయం! - twins marriage at telangana news

వివాహమంటే కనుల పండుగ. ఓ వేదికపై అంతకుమించిన సంబురంతో.. సంభ్రమాశ్చర్యాల నడుమ రెండు కవల జంటలకు వివాహమైంది. తెలంగాణలోని మహబూబ్​బాద్​ జిల్లా వెంకటగి గ్రామం ఆ అరుదైన ఘట్టానికి వేదికైంది.

twins marriage
తెలంగాణలో కవలల కల్యాణం

By

Published : Dec 11, 2020, 10:16 AM IST

వివాహ బంధంతో రెండు కవల జంటలు ఒక్కటైన అపురూప ఘట్టమిది. తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి ఆ అరుదైన ఘట్టానికి వేదికైంది. వెంకటగిరికి చెందిన అంబాల మల్లికార్జున్‌, సుజాత దంపతులకు మహేశ్‌, నరేశ్‌ కవల పిల్లలు. మహేశ్‌ ఐటీఐ పూర్తి చేయగా నరేశ్‌ డిగ్రీ చదువుతున్నాడు. అలాగే, మహబూబాబాద్‌ మండలం నేరడకు చెందిన నేరెల్ల వీరభద్రం, మంగమ్మ దంపతులకు శాంతి, ప్రశాంతి కవల పిల్లలు. మహేశ్‌, శాంతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

తెలంగాణలో కవలల కల్యాణం

ఇరు వర్గాల పెద్దలు వారి కల్యాణానికి అంగీకరించారు. అంతేకాక మహేశ్‌ సోదరుడు నరేశ్‌తో.. శాంతి సోదరి ప్రశాంతికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీనికి నరేశ్‌, ప్రశాంతి అంగీకారం తెలపడంతో గురువారం ఒకే వేదికపై రెండు కవల జంటలకు వివాహం చేశారు.

ఇదీ చూడండి.నా పేరు..జెఫిరా! నేనో... కొవిడ్ సేఫ్టీ రోబోని

ABOUT THE AUTHOR

...view details