Malavath Purna : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిజామాబాద్‌కు చెందిన మలావత్ పూర్ణ మరో ఘనత సాధించారు. అమెరికా దేశం అలస్కాలోని 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలీ శిఖరాన్ని అధిరోహించారు. తాజా ఘనత ద్వారా ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించారు.
ఏడు ఖండాల్లోని పర్వతాలు అధిరోహించిన మలావత్ పూర్ణ
Malavath Purna : ఎముకలు కొరికే చలిలో.. ఊపిరి కూడా సరిగా అందని పరిస్థితుల్లో.. అడుగడుగునా అడ్డంకులే వచ్చినా.. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలన్నీ అధిరోహించాలన్న ఆమె కలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు మాలావత్ పూర్ణ. ఇప్పటికే ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్‌బ్రస్, అకాంకాగువా, కార్టెన్జ్ పిరమిడ్, విన్సన్ వంటి శిఖరాలు అధిరోహించిన పూర్ణ తాజాగా అమెరికా అలెస్కాలోని డెనాలీ శిఖరాన్ని అధిరోహించి ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించారు.
ఏడు ఖండాల్లోని పర్వతాలు అధిరోహించిన మలావత్ పూర్ణ
పూర్ణ జూన్ 5న డెనాలీ శిఖరంపైకి చేరుకొన్నారు. ఉత్తరాదికి చెందిన తండ్రి కూతుళ్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, దియా బజాజ్, విశాఖకు చెందిన అన్మీశ్ వర్మతో కలిసి మే 23న ఆమె యాత్ర ప్రారంభించారు. ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ ఆర్థిక సాయం, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థ సహకారంతో యాత్ర పూర్తి చేశారు. తాజా రికార్డుపై పూర్ణ కోచ్ శేఖర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :