రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల కోసం బీసీ కులాల కార్పోరేషన్లు ఏర్పాటు చేయటంపై.. ముఖ్యమంత్రి జగన్ను అభినందిస్తూ తమిళనాడు పట్టాలి మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు ఎస్.రామదాస్ లేఖ రాశారు. బీసీల కులాల అభ్యున్నతి కోసం 56 కులాల కార్పోరేషన్లు ఏర్పాటు చేయటంతో పాటు 29 కార్పోరేషన్లకు మహిళలను ఛైర్పర్సన్లుగా నియమించటం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని లేఖలో ప్రస్తావించారు. కులాల ప్రస్తావన అభివృద్ధి తిరోగమనానికి సంకేతమనే సూడో రాజకీయ పార్టీల మాటలు వాస్తవం కాదని జగన్ నిరూపిస్తున్నారని కొనియాడారు.
'జగన్.. సామాజిక న్యాయం సంరక్షకుడిగా మారారు'
బీసీ కులాల కార్పోరేషన్లు ఏర్పాటు చేయటంపై సీఎం జగన్ను తమిళనాడు పట్టాలి మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు ఎస్.రామదాస్ అభినందించారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. 29 కార్పోరేషన్లకు మహిళలను ఛైర్పర్సన్లుగా నియమించటం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సామాజిక న్యాయం సంరక్షకుడిగా వైఎస్ జగన్ మారారని ఆయన కొనియాడారు.
బీసీల అభ్యున్నతిని రాష్ట్రాభివృద్ధి ప్రాతిపదికగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకోవటం ప్రగతిశీల ఆలోచనగా రామదాస్ అభివర్ణించారు. ఈ నిర్ణయంతో సామాజిక న్యాయం సంరక్షకుడిగా వైఎస్ జగన్ మారారని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక అభివృద్ధి కేంద్రంగా మారటం సంతోషదాయకమన్నారు. బీసీ కులాల కార్పోరేషన్ల ఏర్పాటు సూక్ష్మ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళలకు నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్థికసాయం, 2024కు మద్య రహితంగా ఏపీని తీర్చిదిద్దటం వంటి అంశాలు రాష్ట్రాభివృద్ధికి కారణమవుతాయని రామదాస్ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉండబోతోంది: చంద్రబాబు