తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రథ నిర్మాణానికి ఎంపిక చేసిన కలప వద్ద... మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ చింత అనురాధ, అధికారులతో కలిసి మంత్రులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు, పురోహితులు... తీర్థప్రసాదాలు అందించారు. వచ్చే కల్యాణం నాటికి స్వామివారి రథం సర్వాంగసుందరంగా రూపొందుతుందని, మరోవైపు రథం దగ్ధం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందని మంత్రులు తెలిపారు.
అంతర్వేది ఆలయ రథం నిర్మాణ పనులు ప్రారంభం - antarved temple issue updates
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతన రథం పనులను ప్రారంభించారు
antarved temple at eastgodavari district