ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓ మెట్టు దిగి.. మనలో ఉన్న లోపాల్ని చూడండి! - friends without misunderstandings

అందరూ మంచి స్నేహితుల్ని కోరుకుంటారు. కానీ మనం ఎలా ఉండాలని మాత్రం ఎవరూ ఆలోచించరు. టీనేజీలో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. ఇలాంటప్పుడు ఒంటరిగా కుంగిపోవడం కంటే.. మనలో ఉన్న లోపాల్ని అధిగమించగలిగితే.. మీకు మంచి నెట్​వర్క్​ ఉన్నట్లే.

maintaining
maintaining

By

Published : Oct 1, 2020, 12:08 PM IST

కొందరు తామెంతగా స్నేహితులతో కలిసినా ...తమకు మాత్రం వారు మంచి స్నేహితులుగా కలిసి ఉండటం లేదని అంటుంటారు కేవలం అవసరానికే మాట్లాడటం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవడం, ఆధిక్యాన్ని ప్రదర్శించాలనుకోవడం వంటి లక్షణాల్ని మీలో వారు గుర్తించినప్పుడు... ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు. మీ స్నేహాన్ని ఎదుటి వారు నమ్మడం లేదంటే ముందు మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాలి. ఆ తప్పుల్ని సరిదిద్దుకోగలగాలి. అప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.

అందరికీ ఒకేలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. కానీ ఎవరి సమస్య వారికి ఎక్కువ ఎప్పుడూ అవతలివారి భావోద్వేగాలను పట్టించుకోకుండా మాట్లాడటం సరికాదు. అవతలివారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆలిని చొరవతో ఆధిక్యం ప్రదర్శిస్తే అసలుకే మోసం రావొచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అపార్థాలు ఎదురుకావు.

స్నేహితులతో కొన్నిసార్లు మాటపట్టింపులు ఎదురవుతుంటాయి. అలాగని ప్రతిసారీ అలగడం, మీదే పై చేయి కావాలనుకోవడం వంటివి చేయొద్దు. ఒకమెట్టు కిందకి దిగి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించి చూడండి. కచ్చితంగా మీ స్నేహం సంతోషంగా సాగిపోతుంది. తప్పొప్పులు ఎవరివైనా ఇద్దరూ కలిసి వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి తద్వారా మీ బంధాన్ని బలపరచుకోవచ్చు.

ఇదీ చదవండిః'నక్కిలీసు గొలుసు' ట్రెండ్.. దుర్గారావు నుంచి మైకేల్ జాక్సన్ వరకు

ABOUT THE AUTHOR

...view details