ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర్ సమరంలో.. ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

nagarjuna sagar by elections
సాగర్ సమరం : ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

By

Published : Apr 17, 2021, 12:46 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం ఓటింగ్ నమోదయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అనుముల మండలం ఇబ్రహీంపేటలో తెరాస అభ్యర్థి నోముల భగత్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. భాజపా అభ్యర్థి రవికుమార్ దంపతులు.. త్రిపురారం మండలం పలుగు తండాలో ఓటు వేశారు.

నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రం 99లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలసి ఓటింగ్​లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జానారెడ్డి కోరారు. కరోనా బారిన పడకుండా ఎన్నికల అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.

చింతగూడెంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తెదేపా అభ్యర్థి అరుణ్‌కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదీ చదవండి:

తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ఎదుట.. తెదేపా నేతల ధర్నా

ABOUT THE AUTHOR

...view details