AP Professional Form : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఒక సామాన్య వ్యక్తిలా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడడం విచారకరమని.. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు. వైకాపా మంత్రులే ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. దేవుళ్లకు సైతం ప్రాంతీయ తత్వాన్ని అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఒక రాజధాని అమరావతికి వెయ్యి కోట్లు పెట్టలేని వారు మూడు రాజధానులకు ఏ విధంగా ఖర్చు పెడతారని మహేశ్వరరావు ప్రశ్నించారు.
AP PROFESSIONAL FORUM : ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే ఎలా? : నేతి మహేశ్వరరావు - ap assembly
AP Professional Form : ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలలో నిబద్దత లేదంటూ.. ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు. వైకాపా మంత్రులే ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. దేవుళ్లకు సైతం ప్రాంతీయ తత్వాన్ని అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని వెల్లడించారు. లేపాక్షి భూముల లీజుకు ఇవ్వడం.. ఆపై దివాలా పేరుతో కొనుగోలు వంటి వాటికి లాబీయింగ్ అవసరమని మహేశ్వరరావు పేర్కొన్నారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/17-September-2022/16398741_jagan.png
2004కు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత నేడు ఆస్తులు ఎంతో చెప్పాలని డిమాండ్చేశారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు లేపాక్షి భూముల లీజుకు ఇవ్వడం.. ఆపై దివాలా పేరుతో కొనుగోలు వంటి వాటికి లాబీయింగ్ అవసరమని అన్నారు. ముఖ్యమంత్రి ఓ వర్గ ప్రజలను టార్గెట్ చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఇవీ చదవండి: