ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన మహాత్మాగాంధీ తత్వాన్ని చేతల్లో చూపిన నిజమైన గాంధేయవాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సరిగ్గా గాంధీ ఆలోచనా విధానంతోనే పల్లెల ప్రగతిని కాంక్షిస్తూ ఏకగ్రీవాలు జరగాలని సీఎం ఆలోచిస్తున్నరని సజ్జల అన్నారు.
సీఎం జగన్ నిజమైన గాంధేయవాది: సజ్జల - సజ్జల రామకృష్ణారెడ్డి వార్తలు
తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మహ్మాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తన ప్రతి చర్యలోనూ గాంధేయవాదాన్ని జగన్ ఆచరించి చూపారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
మహ్మాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం