ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన మహానాడు - ఆంధ్రప్రదేశ్ నేటి వార్తలు

తెదేపా నేతలు ఏటా ఘనంగా జరుపుకునే పసుపు పండగ మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు.

Mahanadu is the grand opening of the andhrapradhesh
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన మహానాడు

By

Published : May 27, 2020, 2:38 PM IST

విశాఖపట్నం జిల్లాలో...

మహానాడు మొదటి రోజులో భాగంగా నక్కపల్లిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్​కు నివాళులు అర్పించారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కారణజన్ముడు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం అన్నారు. లంకల గన్నవరంలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుంటూరు జిల్లాలో...

శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు స్ఫూర్తితో ప్రతిఒక్కరు ముందుకు వెళ్లాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మహానాడు వేడుకలను ఆయన ప్రారంభించారు. నేడు అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.

కర్నూలు జిల్లాలో...

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ప్రకాశం జిల్లాలో...

తెదేపా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని పలువురు నేతలు, కార్యకర్తలు జూమ్‌ యాప్​ ద్వారా వీక్షించారు. పార్టీ కార్యాలయంలో కొద్ది మంది కార్యకర్తలు, నేతలు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇదీచదవండి.

రిక్షావాలా కథ: 8 రోజులు- 11 రిక్షాలు- 1100 కి.మీ.

ABOUT THE AUTHOR

...view details