ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బుల్లెట్ బండెక్కి వచ్చెత్తపా'.. అంటున్న తెరాస ఎంపీ కవిత - ఎంపీ కవిత వార్తలు

"బుల్లెట్ బండెక్కి వచ్చెత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని" ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్​ వైరల్​ కావటంతో ఈ పాట బాగా పాపులర్​ అయింది. ఇప్పుడు ఇదే పాటపై ఎంపీ కవిత డ్యాన్స్​ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నాడు జరిగిన ఓ వివాహ వేడుకల్లో ఆమె నృత్యం చేశారు.

తెరాస నేత కవిత
తెరాస నేత కవిత

By

Published : Aug 26, 2021, 9:37 AM IST

Updated : Aug 26, 2021, 9:44 AM IST

'బుల్లెట్ బండెక్కి వచ్చెత్తపా'.. అంటున్న తెరాస ఎంపీ కవిత

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నాడు జరిగిన ఓ వివాహ వేడుకలో మరోసారి బుల్లెట్​ బండి పాట వైరల్​ అయింది. ఈ పాటకు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత డ్యాన్స్​ చేశారు. స్టేజీపై పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, వారి కుటుంబ సభ్యులతో కలిసి నృత్యం చేశారు. నృత్యం చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 'బుల్లెట్​ బండి' పాట తెగ వైరల్​ అవుతోంది.

ఈనెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రియకు రామక్రిష్ణాపూర్​కు చెందిన ఆకుల అశోక్​తో వివాహం జరిపించారు. పెళ్లి బరాత్​లో వధువు చేసిన డ్యాన్స్ చూసి ప్రముఖులు కూడా ఈ వీడియోను షేర్ చేసి వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ ‘బుల్లెట్‌ బండి...’ పాటకు నవ వధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్‌ ఎండీగా పని చేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి పి.నరహరి ట్వీట్‌ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో భాగంగా.. బుల్లెట్​ బండి పాటకు ఓ నర్సు చేసిన డ్యాన్స్​ ఇప్పుడు ట్రెండ్​ అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లోని కారిడార్​లో ఈ వీడియో తీసినట్లుగా తెలిసింది. పాటకు తగ్గట్టుగా సదరు నర్సు చేసిన డ్యాన్స్​ వైరల్​ అయింది. పాటకు తగ్గ హావభావాలు ప్రదర్శించి తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా ఎంపీ కూడా బుల్లెట్​ బండి పాటపై నృత్యం చేశారు.


ఇదీ చదవండి:Viral Video : 'బుల్లెట్ బండి' పాటపై వధువు డ్యాన్స్.. వరుడు ఫిదా

Last Updated : Aug 26, 2021, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details